కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కీలక భేటీ అయ్యారు.ఈ క్రమంలో అమిత్ షా నివాసానికి వెళ్లిన ఆయన సమావేశం అయ్యారని తెలుస్తోంది.
కాగా ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.ఇందులో ప్రధానంగా బీజేపీ – జేడీ(ఎస్ ) పొత్తులతో పాటు సీట్ల పంపకాలపై చర్చిస్తున్నారని సమాచారం.
ఇటీవలే 2024 లోక్ సభ ఎన్నికల కోసం జేడీఎస్ , బీజేపీ మధ్య పొత్తు పెట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో దేవెగౌడ భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అమిత్ షాతో కుమారస్వామి భేటీ కావడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.