భారత సంతతి విద్యార్ధి హత్య.. మృతుడి కొరియన్ రూమ్‌మేట్‌పై అభియోగాలు, విచారణకు హెల్త్ ఓకే

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో వున్న పర్డ్యూ యూనివర్సిటీలో( Purdue University ) భారత సంతతికి చెందిన విద్యార్ధి హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని కొరియన్ రూమ్‌మెట్ విచారణకు అర్హుడంటూ మీడియా నివేదికలు చెబుతున్నాయి.అక్టోబర్ 2022లో ఇండియానా పోలీస్‌కు చెందిన 20 ఏళ్ల వరుణ్ మనీష్ ఛేడా‌ను( Varun Manish Chheda ) చంపినట్లుగా జి మిన్ షాపై( Ji Min Sha ) హత్యానేరం మోపబడింది.

 Korean Man Found Competent To Stand Trial In Deadly Stabbing Of Indian-origin Ro-TeluguStop.com

ఈ ఏడాది ఏప్రిల్‌లో టిప్పికానో కౌంటీ న్యాయమూర్తి .అతను విచారణలో నిలబడటానికి అనర్హుడని నిర్ధారించారు.జి మిన్ షాకు భ్రాంతులు వున్నాయని.అతను జైలులో వున్నప్పుడు సైకోసిస్, భ్రమ కలిగించే ఆలోచనలను అనుభవించాడని న్యాయమూర్తి తన తీర్పులో రాశారు.

Telugu America, Deadly, Indianorigin, Indiana, Ji Min Sha, Korean, Logansport, P

సెప్టెంబర్ 12న కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం.లోగాన్స్‌పోర్ట్ స్టేట్ హాస్పిటల్‌లోని వైద్యులు నెలల చికిత్స తర్వాత షా విచారణకు ఇప్పుడు అర్హుడిగా తేల్చారు.కోర్టు ప్రోసీడింగ్స్‌ను అర్థం చేసుకోగల సామర్ధ్యాన్ని అతను సాధించాడని లోగాన్స్‌పోర్ట్ స్టేట్ హాస్పిటల్( Logansport State Hospital ) సూపరింటెండెంట్ బెథానీ స్కోన్‌రాడ్ట్ న్యాయమూర్తికి లేఖ రాశారు.దీంతో షాను తిరిగి కౌంటీ జైలుకు తరలించాలని టిప్పెకానో కౌంటీ షెరీఫ్ కార్యాలయాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.

Telugu America, Deadly, Indianorigin, Indiana, Ji Min Sha, Korean, Logansport, P

ఈ కేసులో స్టేటస్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 29న జరగనుంది.షా, వరుణ్‌లు పర్డ్యూ యూనివర్సిటీ వెస్ట్ లఫాయెట్ క్యాంపస్‌లోని మెక్‌కట్చియెన్ హాల్‌లో నివసించారు.వరుణ్ మృతదేహాన్ని కనుగొన్న కుర్చీకి సమీపంలో నేలపై అధికారులు మడతపెట్టే కత్తిని కనుగొన్నారు.దీని సాయంతోనే వరుణ్‌ను షా పొడిచి చంపాడని ప్రాసిక్యూటర్ ఆరోపించారు.పర్డ్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైట్ మాట్లాడుతూ.అక్టోబర్ 5, 2022న షా పోలీసులకు ఫోన్ చేసి తన రూమ్‌మేట్ డార్మ్ రూమ్‌లో చనిపోయినట్లు సమాచారం అందించాడు.

షాను అరెస్ట్ చేసిన అధికారులకు పోస్ట్‌మార్టం రిపోర్టులో వరుణ్ పదునైన గాయాల కారణంగా మరణించినట్లు తేలింది.నేరం రుజువైతే షాకు 45 నుంచి 60 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube