యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddhartha ) ప్రజెంట్ రెండు పాన్ ఇండియన్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.అందులో ఒకటి ‘స్వయంభు‘.
ఈ సినిమాపై ప్రకటన తోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.కార్తికేయ 2, 18 పేజెస్ వంటి సినిమాలు సక్సెస్ తర్వాత స్పై తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

భరత్ కృష్ణమాచారి( Bharat Krishnamachari ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్వయంభు’ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.ఈ పోస్టర్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా కోసం నిఖిల్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే ఇందులో ఒక వారియర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ రోల్ కోసం అందులో పెర్ఫెక్ట్ గా కనిపించడం కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు.తాజాగా ఈయన షేర్ చేసిన పిక్ షేర్ చేస్తూ స్వయంభు( Swayambhu ) కోసం మార్షల్ ఆర్ట్స్, కర్రసాము, కత్తి యుద్ధం లాంటివి చేస్తున్నట్టుగా తాను తెలిపాడు.

దీంతో ఈయన డెడికేషన్ ను అంతా ప్రశంసిస్తున్నారు.సినిమా కోసం అంత కష్టపడుతుండడంతో ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.మరి నిఖిల్ కు ఇది ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.







