దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధాజ్ఞలు విధించింది.ఇందులో భాగంగా స్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్ లు వినియోగించడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పాఠశాల ఆవరణ, ప్లే గ్రౌండ్ లలో టీచర్లు కూడా సెల్ ఫెన్లను ఉపయోగించకూడదని ఢిల్లీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం కోసం అన్ని పాఠశాలల్లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని సర్క్యులర్ లో వెల్లడించింది.దీని ద్వారా పిల్లల ఏకాగ్రతతో పాటు ఉపాధ్యాయుల ఏకాగ్రతకు సైతం భంగం కలగకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.







