రెండు తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది.తెలంగాణలో భోళా శంకర్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా ఏపీలో బుకింగ్స్ ఆలస్యంగా మొదలుకావడంతో కొంతమేర బుకింగ్స్ తగ్గాయి.
ఏపీలో టికెట్ రేట్ల పెంపు( Movie Tickets Price ) లేకపోవడంకూడా భోళా శంకర్ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

భోళా శంకర్ సినిమాకు నెటిజన్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.యావరేజ్ అని కొంతమంది ఈ సినిమా గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం ఈ సినిమా హిట్ అని చెబుతున్నారు.మెహర్ రమేష్( Meher Ramesh ) గత సినిమాలతో పోల్చి చూస్తే మాత్రం ఈ సినిమా బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా చిరంజీవి యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ అయింది.
ఫస్టాఫ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండగా సెకండాఫ్ విషయంలో మెహర్ రమేష్ వేదాళం( Vedalam Remake )ను ఫాలో అయ్యారు.
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కంటెంట్ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.భోళా శంకర్ సినిమా హిట్టే కానీ వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) రేంజ్ హిట్ అయే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చే అవకాశం అయితే ఉంది.

భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్( Keerthy Suresh ) నటన ఆకట్టుకునేలా ఉంది.సినిమాలోని ఖుషి సీన్ కు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడుతున్నాయి.భోళా శంకర్ కమర్షియల్ లెక్కల గురించి క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.
కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాలోని సీన్లను షేర్ చేస్తుండగా మేకర్స్ జాగ్రత్త పడాల్సి ఉంది.మెహర్ రమేష్ డైరెక్షన్, కొన్ని రొటీన్ సీన్స్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.







