వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో రెండో స్థానానికి గట్టిపోటీ నెలకొందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీడీపీ ఓటర్లు జనసేన వైపు, జనసేన ఓటర్లు బీజేపీ వైపు వెళ్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.ఏదేమైనా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు 2024 కంటే 2029 ఎన్నికలకు సిద్ధం కావడం ఉత్తమమని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.
వైసీపీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







