మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ విడుదలపై వైజాగ్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించనున్నారు.ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ కాపీ అందగానే విశాఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు భోళాశంకర్ సినిమా డిజిటల్ రైట్స్ ను కోర్టు పెండింగ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.కాగా అన్ని ఫ్లాట్ ఫామ్ లలో సినిమా విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన ఐదు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం నాలుగు పిటిషన్లను కొట్టివేసింది.
ఈ క్రమంలోనే తదుపరి విచారణను సెప్గెంబర్13వ తేదీకి వాయిదా వేసింది.అయితే దీనిపైనే డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించనున్నారు.







