డబ్బు ఉందంటే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు, డబ్బు ఉందంటే ఎలాంటి విలాసవంతమైన జీవితం కావాలంటే అలాంటి జీవితం దర్జాగా జీవించవచ్చు.అయితే ఓ పెళ్లి జంట ఏకంగా వెండి చెప్పులు చేయించుకుని, పెళ్లికి వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆ చెప్పులు కేవలం వెండి చెప్పులే కాదు అందులో అలంకరణ కోసం ముత్యాలు, రత్నాలను( Pearls , gems ) అమర్చారు.వధూవరులు ధరించిన ఆ వెండి చెప్పులు( Silver sandals ) ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి.
ఆ చెప్పులు ఎవరు తయారు చేశారో.ఆ చెప్పుల ధర ఎంతో అనే వివరాలు చూద్దాం.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో( Lucknow, Uttar Pradesh ) ఓ నగల వ్యాపారి 300 నుంచి 500 గ్రాముల వెండితో చెప్పులు తయారు చేస్తున్నాడు.ఆ వెండి చెప్పులు అందంగా కనిపించడం కోసం అందులో రకరకాల ముత్యాలు రకరకాల రత్నాలను అమర్చాడు.వెండిని బట్టి ఆ చెప్పుల ధర ఉంటుంది.వెండి చెప్పుల ప్రారంభ ధర రూ.25000 ఉంటుందని తయారీదారుడు తెలిపాడు.పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంతకంటే ఖరీదైన చెప్పులను వినియోగిస్తూ ఉంటారు.
సెలబ్రెటీలు ఉపయోగించే చెప్పులు ధర లక్షల విలువ కూడా ఉంటుంది.కాకపోతే తో చేసిన చెప్పులు అంటే కాస్త డిఫరెంట్ గా ఉంటాయి.
అందుకే ఇలా వెండి చెప్పులను తయారు చేస్తున్నామని నగల షాపు యజమాని వినోద్ మహేశ్వరి( Vinod Maheshwari ) తెలిపారు.ఎటువంటి డిజైన్ కావాలంటే అటువంటి డిజైన్లు చెప్పులు తయారు చేసి ఇస్తామని తెలిపారు.
ప్రస్తుత కాలంలో వరుడు ఎక్కువగా షేర్వానీలు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది.అందుకే షేర్వానీకి తగిన మోడల్ లో వరుడు ధరించే బెల్టును కూడా వెండితోనే తయారు చేస్తున్నారు.ఈ షేర్వానీ ధరించిన వరుడు ఇంకాస్త బాగా కనిపించడం కోసం అందమైన వెండి చెప్పులను తయారు చేస్తున్నారు.ఈ వెండి చెప్పులు చూసే వారందరినీ ఆకట్టుకుంటున్నాయని, చాలామంది ఈ చెప్పులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని షాప్ యజమాని తెలిపారు.
ఈ చెప్పులు ధరిస్తే రాయల్ లుక్ వేరుగా ఉంటుందని ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.