మెడికల్ కాలేజ్ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మెడికల్ సీట్లలో రూ.
వంద కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఈడీ అభియోగిస్తుంది.ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారులకు ఈడీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.2016 నుండి 2022 వరకు మెడికల్ కాలేజ్ పీజీ అడ్మిషన్లలో గోల్ మాల్ జరిగిందని ఈడీ ఆరోపణలు చేస్తుంది.ఈ వ్యవహారంపై ఇటీవలే 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మల్లారెడ్డి కాలేజీతో పాటు పలు ప్రముఖ కాలేజీలపై తనిఖీలు నిర్వహించారు.సోదాలు అనంతరం అధికారులు భారీగా నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు.
మల్లారెడ్డి కాలేజీ ఛైర్మన్ గా భద్రారెడ్డి, జనరల్ సెక్రటరీగా మహేందర్ రెడ్డి ఉన్న నేపథ్యంలో వీరిద్దరితో పాటు పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు.వచ్చే వారం మెడికల్ కాలేజ్ యాజమాన్యాలకు ఈడీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.
అయితే ఫిబ్రవరి 2022 లో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.







