సుదీర్ఘ సమాలోచనాల తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ,( Ponguleti Srinivas Reddy ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో( CM Jagan ) బెటికావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.రాజకీయంగా వేరువేరు పార్టీలైన ఈ ఇద్దరి నేతల కలయిక కొత్త రాజకీయ సమీకరణలకు చర్చా వేదికగా మారింది.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు కూడా జగన్తో భేటీ అయినప్పటికీ ఆయన వ్యాపార వ్యవహారాలలో భాగంగా కలిశారని అప్పట్లో వార్తలు వచ్చాయి .అయితే కాంగ్రెస్ లో( Congress Party ) చేరిన వెంటనే జగన్ తో భేటీ కావడం వెనక రాజకీయ పరిణామాలను చర్చించడానికే అని ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి.

ముఖ్యంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల( Sharmila ) కాంగ్రెస్ లో కలయిక గురించే ప్రదానం గా చర్చ జరిగిందని తెలుస్తుంది .వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్ప చెబుతారని, ఆమె పులివెందుల నుంచి పోటీ చేయబోతుందని ప్రచారం జరుగుతుండగా దాని తదనంతర పరిణామాలను చర్చించడానికి ఇద్దరు నేతలు కలిసి ఉండవచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి .షర్మిల రాజకీయ ప్రయాణం తమ పార్టీపై చూపించే ప్రభావాన్ని, ముఖ్యం గా కాంగ్రెసు ఆంధ్ర ప్రదేశ్ లో ఎదగడానికి ఉన్న అవకాశాలు , వైఎస్ ఆర్ పార్టీ పై ఏమైనా ప్రభావం ఉంటుందా , కీలక నేతలు ఎవరైనా పార్టీ మారే అవకాశం ఉన్నదా అని అంచనా వేసేందుకే పొంగలేటితో జగన్ చర్చించారని వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీకి సాంప్రదాయక ఓటర్లు ఒకరే కాబట్టి కాంగ్రెస్ ఎదుగుదల తమ పార్టీకి నష్టమవుతుందన్న అంచనాలలో ఉన్న జగన్ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెట్టారని తెలుస్తుంది .ఏది ఏమైనా ఒక జాతీయ పార్టీలో చేరిన కొన్ని రోజులకి జగన్తో మీట్ ఇవ్వడం ద్వారా తాను జగన్కి ఎంత నమ్మకస్తుడైనవ్యక్తో పొంగులేటి నిరూపించుకున్నట్లయ్యింది .తాను ఏ పార్టీలో ఉన్నా జగన్ అనుకూల రాజకీయాలే చేస్తానని ఆయన తన భేటీ ద్వారా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.మరి దీనిపై కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి
.






