సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరాక ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
ప్రకృతి శక్తులైన గాలి, నీటి ముందు ఏవీ నిలబడలేవు.అవి ఉగ్రరూపం దాలిస్తే ఎంతటి కట్టడమైనా నెలకొరగాల్సిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు ఆ దృశ్యం కళ్లారా కనబడుతుంది.అందుకే ప్రకృతి విషయంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ అయిన ఈ వీడియో జనాలకు భయభ్రాంతులను కలిగిస్తోంది.
స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలో( Canary Islands of Spain ) ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే… బీచ్ ఒడ్డున అంటే సముద్రానికి దగ్గర్లో ఓ భారీ భవనం (హోటల్) నిర్మించారు.దాంతో ఆ సుందర భవనం( Beautiful building ) సముద్రపు అలల తాకిడికి మెల్లగా నెలకొరుగుతున్న పరిస్థితి.
ఓ భారీ అలకు ఆ భవనం బాల్కనీ పూర్తిగా ధ్వంసం అయిన పరిస్థితిని ఇక్కడ చూడవచ్చు.అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా సముద్రానికి అంత దగ్గరగా భవనం నిర్మించడం పట్ల సదరు వానర్ పైన జనాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.సముద్రానికి అంత దగ్గరగా బిల్డింగ్ కట్టడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం, అసలు పర్మిషన్ మీకు ఎవరిచ్చారు? అని కొంతమంది నెటిజన్లు ఆ బిల్డింగ్ ఓనర్ ని ప్రశ్నిస్తే, మరికొందరు “ఆ హోటల్‌లో ఉండాలనుకునేవారు తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకొని పాడుకోవడమే” అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక కొందరైతే బుద్ధున్నవాడు అలా అంత డబ్బు ఖర్చు చేసి అక్కడ భవంతిని నిర్మించాడంటూ ఓ రేంజులో ఏకేస్తున్నారు.మరెందుకాలస్యం, మీరు కూడా మీమీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.