పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత డార్లింగ్ నుండి రాబోతున్న నెక్స్ట్ మూవీ అయిన బ్లాక్ బస్టర్ సాధించి డార్లింగ్ పరువు కాపాడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అందుకే నెక్స్ట్ రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్”.
( Salaar ) కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నీల్ మీద నమ్మకంతో ఆయనైనా ప్రభాస్ కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్ముతున్నారు.
మరి నీల్ అయిన ప్రభాస్ కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా నుండి టీజర్ ( Salaar Teaser ) కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ టీజర్ గురించి అప్డేట్ వచ్చింది.సలార్ టీజర్ ను జులై 6వ తేదీన ఉదయం 5 గంటల 12 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
చూడాలి మరి ఈ టీజర్ తో ఎన్ని సరికొత్త రికార్డులను ప్రభాస్ క్రియేట్ చేస్తాడో.

కాగా ప్రభాస్ కెరీర్ లోనే మాస్ లుక్ ను డిజైన్ చేసిన నీల్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ మూవీగా తీర్చి దిద్దారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.







