దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీలో ఉన్నారు.పార్టీ అధిష్టానం అపాయింట్ మెంట్ కోసం హస్తినలో ఆయన ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి,ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవులు ఇవ్వాలని రఘునందన్ రావు ఆశిస్తున్నారు.
దాదాపు పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానన్న రఘునందన్ రావు తానేందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ప్రశ్నిస్తున్నారు.చేసిన పనికి కూలీ అడుగుతున్నానని, కొని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చన్నారు.
అదేవిధంగా దుబ్బాకలో మరోసారి కూడా తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.







