Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ ఇదే.. వార్నింగ్ ఇచ్చి ఆ రోడ్డు మోక్షం కలిగేలా చేశాడుగా!

టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వారాహి విజయ యాత్ర( VarahiYatra )లో భాగంగా బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.

 Roads Repairs In Andhra Pradesh-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా రాజోలు నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ పర్యటించారు.ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను చూసిన పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం( YCP ) అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచుకుపడ్డారు.

Telugu Andhra Pradesh, Ap, Janasena, Pawan Kalyan, Razole Bypass, Roads Repairs,

రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా దారుణంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు.పవన్ ఇచ్చిన గడువు దగ్గర పడటం పవన్ శ్రమదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియడంతో వెంటనే ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ మీడియా( Social media ) వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.

దీంతో జనసేన పవన్ కళ్యాణ్ దెబ్బకు ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం దిగి వచ్చింది.ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Janasena, Pawan Kalyan, Razole Bypass, Roads Repairs,

రాజోలు ఎంట్రన్స్‌లో ఉండే బైపాస్‌ రోడ్డు సుధీర్ఘ కాలంగా పూర్తి అధ్వాన్న స్థితిలోకి మారింది.ఇటువైపుగా భారీ వాహనాలు రావడంతో మరింత దారుణంగా మారింది.దీంతో ఈ రోడ్డుమార్గం ద్వారా వెళ్లాలంటే ఒళ్లు హూనమయ్యే పరిస్థితి.గర్భిణీలు, వృద్ధులు, ఇతర అనారోగ్యంతో బాధపడేవారు ఇటువైపుగా రాకపోకలు చేసే సమయంలో తీవ్ర అవస్థలు పడేవారు.

వర్షాకాలంలో అయితే ఎక్కడ బడితే అక్కడ ఉన్న భారీ గుంతల్లో నీరు చేరి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ప్రమాదముందో తెలియక అనేక మంది ప్రమాదాల బారిన పడ్డారు.మలికిపురం సభ వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపు అధికారుల్లో కదలిక తీసుకువచ్చిందంటున్నారు పలువురు.

ప్రభుత్వం రోడ్డు నిర్మించకుంటే 15 రోజుల తరువాత తానే రంగంలోకి దిగి శ్రమదానం చేసి రోడ్డు వేయిస్తానని పవన్‌ హెచ్చరించడంతో ఆ రోడ్డుకు మోక్షం కలిగింది.అయితే తాత్కాలిక మరమ్మతులు కాదని పూర్తి స్థాయి రోడ్ ను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే నిధులు మంజూరు అయ్యాయని కాంట్రాక్టర్ ను ఎంపిక చేస్తామని అధికారులు కవర్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube