బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గాఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హన్సిక ( Hansika )తన సినీ కెరియర్లో దాదాపు 50 సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఈమె గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టినటువంటి హన్సిక ఒకవైపు వ్యక్తిగత జీవితంలోను మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.పెళ్లి తర్వాత కూడా ఈమె వరుసగా హిందీ సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక తమిళంలో ఈమె హీరో ఆది పినిశెట్టి( Adi Pinishetty )తో కలిసి నటించిన పార్ట్నర్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నై వచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి హన్సిక ఈ సమావేశంలో భాగంగా ఎన్నో విషయాలను తెలియజేశారు.పార్ట్నర్ సినిమా( Partner Movie )లో తాను విభిన్న పాత్రలో నటించాలని తెలిపారు.
ఇందులో తాను పురుషుడిగా మారే పాత్రలో కనిపిస్తానని ఈమె తెలియజేశారు.అయితే తనకు అన్ని ఇలాంటి విభిన్న పాత్రలే రావాలని ఏమీ లేదు కదా నచ్చితే తాను ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనని తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో ఈమె పురుషుడిగా మారే పాత్రలో నటించాను అని చెప్పడంతో నిజజీవితంలో అలాంటి అవకాశం ఉంటే మీరు ఎవరిలా మారతారు అన్న ప్రశ్న ఈమెకు ఎదురయింది.దీంతో ఈమె తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) లాగా మారిపోతాను అంటూ కామెంట్ చేశారు.నిర్మాణరంగం వైపు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నించడంతో తనకు నటిగా నటించడమే ఇష్టం.నటన పరంగా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కానీ ఎలాంటి లక్ష్యాలు లేవని తెలిపారు.
అందరి చేత ఒక మంచి మనిషి అనిపించుకుంటే చాలని అంతకుమించి తనకు వేరే ఆలోచనలు ఏ మాత్రం లేవని తెలిపారు.ఇండస్ట్రీలో నటిగానే కొనసాగుతాను తప్ప దర్శకత్వం వైపు నిర్మాణరంగం వైపు వెళ్ళనని తనకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలియజేశారు.







