నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ( Varahi yatra )సాగింది.సోమవారం యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం జగన్ ( CM Jagan )పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దీంతో పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కౌంటర్లు వేయడం జరిగింది.పవన్ మాటలకు పద్ధతి, పాడు లేదు.
రాజకీయాల్లో డైలాగులు చెప్పి వెళ్ళిపోతే కుదరదు.వాస్తవాలు తెలుసుకుని రాజకీయాల్లో మాట్లాడాలి.
వారాహి విజయ యాత్రలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) కౌంటర్ ఇవ్వడం జరిగింది.ఇదే సమయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా స్పందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఏంటో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.ఆయన రాజకీయ అధికారం కోసం పార్టీ పెట్టలేదని.
కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.ఇదే సమయంలో డబ్బు కోసం అభిమానులను తాకట్టు పెడుతున్నారని విమర్శల వర్షం కురిపించారు.