జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఉభయగోదావరి జిల్లాలలో చురుగ్గా జరుగుతుంది.ఈ సందర్భంగా హీరో ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన సినిమా చేయటం వల్ల కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పుకొచ్చారు.దాంతో వాళ్లు రోజుకి ₹500 లేదా ₹1000 మరికొన్నిసార్లు ₹2000 కూడా సంపాదించుకుంటారని తెలిపారు.
ఇంక సినిమా విడుదలయితే చాలామంది బతుకుతారని తెలియజేయడం జరిగింది.మేమంతా సినిమాలు చేసి డబ్బులు సంపాదించాం.
మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర అన్ని వేల కోట్లు డబ్బు ఎలా వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే నరసాపురం సభలో ప్రభాస్( Prabhas ) అభిమానులకు పవన్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
విషయంలోకి వెళ్తే ప్రభాస్ గారి అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు.అందరు హీరోలను అభిమానించాలి.నేను రాజకీయాల్లో ఒక్కడిగా ఉండాలనుకోవటం లేదు.ఎక్కువమంది రాజకీయాల్లోకి రావాలి.
కానీ ప్రజాక్షేమాన్ని కాంకాంక్షించేవారు కావాలి అని స్పష్టం చేయడం జరిగింది.

సినిమా ఇండస్ట్రీ అంటే తను ఒక్కడినే కాదని అందరూ హీరోలు కలిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందని గతంలో వారాహి యాత్ర(Varahi Vijaya Yatra)లో పేర్కొన్నారు.ఇండస్ట్రీలో హీరోలు అందరూ కలిసే ఉంటారని ఎదురుపడినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది.అంతేకాదు గతంలో ప్రభాస్, మహేష్ తనకంటే పెద్ద హీరోలని పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలో నరసాపురంలో ప్రభాస్ పై మరోసారి పవన్ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.







