నిర్మాతగా మారబోతున్న ఎన్టీఆర్.. ఆ టాలెంటెడ్ హీరోకు తొలి ఛాన్స్ ఇస్తాడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్( Hero NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులారిటిని ఏర్పరచుకున్నాడు.ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఎన్టీఆర్ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే పలు స్టార్ హీరోలకు సెపరేట్ ప్రోడక్షన్ హౌజ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవలే రామ్ చరణ్ ఒక కొత్త బ్యానర్‌ను స్థాపించారు.

అలాగే ప్రభాస్‌కు యూవీ, మహేష్‌కు ఎంబీ వంటి సంస్థలు ఉన్నాయి.ఇక లేటెస్ట్‌గా ఎన్టీఆర్ సొంత సంస్థను స్థాపించనున్నారని తెలుస్తోంది.

ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించబోతున్నారట తారక్.కాగా ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు టాక్.అంతేకాదు ఎన్టీఆర్ నిర్మాతగా తన మొదటి చిత్రాన్ని ప్రముఖ హీరో నానితో( Hero Nani ) చేయబోతున్నట్టువస్తున్న వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలో నటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు