గుడుంబా శంకర్ బీట్స్ ను 'బ్రో'లో ప్లాన్ చేస్తున్న థమన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Saidharam tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”( Bro movie ).ఈ సినిమా ఇస్తున్న అప్డేట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Gudumba Shankar Song Remix In Bro Movie Details, Pawan Kalyan, Gudu-TeluguStop.com

ఈ సినిమాను వినోదయ సీతం( Vinodhaya Sitham movie ) అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.

Telugu Bro, Bro Latest, Gudumba Shankar, Pawan Kalyan, Pawankalyan, Remix, Samut

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సముద్రఖని ( Samuthirakani )దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.అందులోను ఈ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చేయి కూడా పడడంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను ఆ తర్వాత తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఆ తర్వాత ఈ సినిమా నుండి ఇద్దరినీ కలిపి ఉండే సాలిడ్ పోస్టర్ ను రివీల్ చేసారు.

దీనికి కూడా ఆడియెన్స్ ను అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇలా ఒక్కో పోస్టర్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తేవడంతో ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేసు కుంటున్నారు.

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పుడొక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Bro, Bro Latest, Gudumba Shankar, Pawan Kalyan, Pawankalyan, Remix, Samut

ఈ సినిమాలో పవన్ వింటేజ్ ట్యూన్స్ ను మిక్స్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక సాంగ్ కోసం పవన్ నటించిన గుడుంబా శంకర్ సినిమా నుండి కిళ్లీ కిళ్లీ సాంగ్ లోని బీట్ ను థమన్ బ్రో సినిమాలో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు మరింత ఖుషీ ఇవ్వడం ఖాయం.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

చూడాలి సముద్రఖని మన తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube