బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం తోట మాట్లాడుతూ ఏపీలో సాగు, తాగునీరు లేదని విమర్శించారు.విపక్షాలను బీజేపీ అణగదొక్కుతుందన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశం స్వీకరించే పరిస్థితి లేదని చెప్పారు.బీజేపీని గద్దె దించాలనే ఫెడరల్ పార్టీలను ఏకం చేయాలని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.ఏపీలో రాజధానిని నిర్మించుకోలేకపోయామని పేర్కొన్నారు.
ఏపీలో రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.ఏపీలో నిరుద్యోగం పెరిగిందని, పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు.
ప్రత్యేక హోదా లేదు.రాజధానికి నిధులు లేవని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేంద్రంలో మోదీని ఢీకొట్టే శక్తి కేవలం కేసీఆర్ కు మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు.







