నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు జట్టుగా మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాను నరేష్ ( Naresh )తన వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమాని స్వయంగా నరేష్ నిర్మించడం విశేషం.ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నరేష్ పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.ఈ సినిమా వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించామని వార్తలు వస్తున్నాయి.
అలాగే రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఈ సినిమా చేసామంటూ కూడా వార్తలు వచ్చాయి.

రివేంజ్ తీర్చుకోవడం కోసమైతే యూట్యూబ్లో రెండు వీడియోలు పెడితే సరిపోయేది 15 కోట్లు ఖర్చు చేసే సినిమా చేయాల్సిన అవసరం లేదంటూ ఈయన తెలియజేశారు.ప్రస్తుతం సమాజంలో వివాహ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా చేయడం కోసమే ఈ సినిమా చేసామని నరేష్ తెలిపారు.కొన్ని పరిస్థితుల నడుమ నేను విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది.
అయితే మా మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చి మా బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది.తన పేరు నేను ప్రస్తావించదల్చుకోలేదని నరేష్ తెలిపారు.
పవిత్ర నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది కనుక నా ప్రాణం ఉన్నంత వరకు ఆమెకు అండగా ఉంటానని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో పవిత్ర లోకేష్ కూడా మాట్లాడుతూ.
ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు నరేష్ కి మధ్య పరిచయం ఏర్పడిందని అయితే ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో కలిసిన నటించే అవకాశం వచ్చిందని తెలియజేశారు.మా ఇద్దరి ఆలోచనలు ఒకటే,ఏ విషయంలోనైనా పాజిటివ్ గానే ఆలోచిస్తామని, రివెంజ్ తీర్చుకునే వ్యక్తిత్వం మాది కాదు అంటూ పవిత్ర లోకేష్ తెలియజేశారు.
సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.ఆ సమయంలో చాలా బాధ కలిగిందని అప్పుడు నాకు నరేష్ చాలా అండగా నిలబడ్డారు అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ కామెంట్ చేశారు.







