అమరావతి ఆర్5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్ 5 జోన్ పై రైతుల పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.
అయితే జీవో నంబర్ 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది.
కాగా అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసింది.







