సరిగ్గా సంవత్సర కాలానికి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) కి స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యం లో వచ్చే సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కూడా అదే సమయం లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నేత, ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్( Nara Lokesh ) రాష్ట్ర వ్యాప్త పాద యాత్ర కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే పాద యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని దూసుకు పోతోంది.

ఈ స్థాయిలో పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తే <ఆశ్చర్యంగా ఉంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదే జోరు కొనసాగిస్తూ పాద యాత్ర కంటిన్యూ చేయడం వల్ల కచ్చితంగా తెలుగు దేశం పార్టీ కి ఏపీ ప్రజలు మరో సారి అధికారాన్ని కట్టబెట్టడం ఖాయం అని కూడా ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారట.ఇక చంద్ర బాబు నాయుడు( Chandrababu Naid ) ఈ వయసు లో కూడా విశ్రాంతి అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, రోడ్ షో లు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

లోకేష్ పాద యాత్ర ప్రభావం ఉండబోదని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ తెలుగు దేశం పార్టీ( TDP ) నాయకులు మాత్రం చాలా బలంగా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం పాదయాత్ర కారణంగా లోకేష్ ఇమేజ్ భారీగా పెరగడం ఖాయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ గతంలో ఏపీ లో అధికారంను దక్కించుకున్న విషయం తెల్సిందే.
మరోసారి బాబును నమ్మి ఏపీ ప్రజలు అధికారంను కట్టబెట్టేనా చూడాలి.







