జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా నటిస్తూ సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం సినిమాలలో ఎంతో బిజీగా మారినటువంటి వారిలో కమెడియన్ మహేష్ ( Mahesh ) ఒకరు.రంగస్థలం సినిమాలో నటించిన ఈయన ఈ సినిమాలో ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఏకంగా ఈయన రంగస్థలం మహేష్ గా పేరు సంపాదించుకున్నారు.
ఇలా రంగస్థలం సినిమా తర్వాత మహేష్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena ) పార్టీ గురించి పలు విషయాలు తెలియజేశారు.

తనది ఈస్ట్ గోదావరిలోని శంఖరగుప్తం అని తెలియజేశారు.ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.పవన్ కల్యాణ్ను అందరూ చాలా ప్రేమిస్తారని పేర్కొన్నారు.జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు.ఇక ఈ ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి తనకు పోటీ చేయాలని ఉందని దేవుడు దయ తలచి ఆ పార్టీ నుంచి తనకు ఎమ్మెల్యేగా టికెట్ వస్తే తప్పకుండా జనసేన పార్టీ తరఫున పోటీకి వస్తాను అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోలతో కలిసి సినిమాలు చేశారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ( Sardar Gabbersingh ) సినిమాలో కూడా ఈయన పవన్ తో కలిసి నటించారు.ఇలా పవన్ గురించి మాట్లాడుతూ ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం అని తెలియజేశారు.
ఇక షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆహార పదార్థాలు అయితే తింటారో లొకేషన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా అలాంటిదే ఉండాలని చెప్పేవారు.ఇలాంటి ఓ మంచి మనసున్న వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీ కోసం పనిచేయడానికి తాను సిద్ధమేనంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







