మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే తాజాగా ఈయన రామబాణం( Ramabanam ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీవాస్ (Sriwaas) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో సీనియర్ నటులు అయినటువంటి కుష్బూ జగపతిబాబు వంటి సెలబ్రిటీలు కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో గోపీచంద్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ వచ్చారు.
ఈ క్రమంలోని ఈయన నటుడు జగపతిబాబుతో ( Jagapathi Babu )కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక వీరిద్దరిని హీరో నవదీప్ ( Navadeep) ఇంటర్వ్యూ చేశారు.ఇంటర్వ్యూలో భాగంగా నవదీప గోపీచంద్ ను ప్రశ్నిస్తూ మీకు కనుక ప్రభాస్ ( Prabhas ) సినిమాలో విలన్ ( Villain )గా నటించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ ప్రభాస్ కి విలన్ గా నటించడానికి తాను ఇప్పటికీ సిద్ధమేనని తెలిపారు.
గతంలో ప్రభాస్ తో కలోసి తాను వర్షం(Varsham) సినిమాలో ఆయనకు విలన్ గా నటించానని గుర్తు చేసుకున్నారు.అయితే తనకు విలన్ పాత్రలలో అవకాశం వస్తే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలని తెలియజేశారు.

తాను నటించిన జయం, వర్షం, నిజం సినిమాలలో నాకు ఎలాంటి విలన్ పాత్రలు వచ్చాయో అలాంటి పాత్ర ఉండాలని కథని మొత్తం ఎలివేట్ చేసేలా ఉండాలని గోపీచంద్ తెలిపారు.ఇలాంటి కథ ఉంటే తాను తప్పకుండా విలన్ పాత్రలలో నటిస్తాను అంటూ ఈ సందర్భంగా గోపీచంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక వ్యక్తిగతంగా ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు ప్రాణ స్నేహితులు.అయితే తెరపై మాత్రం తనతో ఢీ కొట్టడానికి సిద్ధమేనంటూ గోపీచంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక వర్షం సినిమాలో వీరిద్దరి నటన ఎలా ఉందో మనకు తెలిసిందే.







