అరటి పండంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.మనలో చాలామంది డజన్ల కొద్ది అరటిపండ్లు లాగించేస్తుంటారు.
ఎందుకంటే అరటి పండులో అన్ని పోషకాలు ఉంటాయి మరి.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తికి బాగా ఆకలి వేసిందేమోగాని అరటి పండుని ఆవురావురమంటూ తినేసాడు.అయితే, అతను తిన్నది అలాంటి ఇలాంటి అరటి పండు( Banana ) కాదు మరి.దాంతో అతగాడు అక్షరాలా రూ.98 లక్షలు చెల్లించుకోవలసి వచ్చింది.
ఎందుకంటే అది అలాంటిలాంటి పండు కాదు.చాలా అరుదైన, విలువైన, అమూల్యమైన అరటి పండు మరి.అవును, ఆ అరటి పండు విలువ అంత ఉంటుంది మరి.అలాంటి అరటి పండు కనబడగానే మనోడు ముందూ వెనుకా ఆలోచించకుండా లటుక్కున మింగేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు దానిపైన రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, దక్షిణ కొరియా ( South Korea )రాజధాని సియోల్‌లోని లీమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మ్యూజియంలో గోడపై ఒక అరటిపండును చూపారులకోసం తగిలించారు.ఇది ప్రసిద్ధ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ యొక్క కళాకృతిలో ఓ భాగం అని చెప్పుకోవాలి.దానిని నల్లటి టేపుతో తెల్లటి గోడకు అతికించడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చు.ఈ కళాకృతికి ‘ది కమెడియన్’( The Comedian ) అని పేరు కూడా పెట్టడం జరిగింది.
అయితే, కొద్ది రోజుల క్రితం విద్యార్థి నోహ్ హుయెన్-సూ మ్యూజియం( Noah Huen-Tsoo Museum ) సందర్శనకు రాగా ఆ క్రమంలో మ్యూజియంలోని వస్తువులను ఒకసారి పరిశీలించి, ఆ సమయంలో గోడకు వేలాడుతున్న అరటిపండును చూసి లొట్టలేసుకుని మరీ తినేసాడు.అయితే ఆ కళాకృతి ఖరీదు 12,000 యూఎస్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.98 లక్షలు.ఆ విషయం తెలియక మనోడు లాగించేసాడు.అయితే మ్యూజియం ఆ విద్యార్థికి ఎలాంటి పరిహారం విధించబోమని ప్రకటించింది.