టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ( Anchor Vishnupriya ) ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఎక్కువగా సందడి చేయకపోయినా యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు బాగానే దగ్గరవుతున్నారు.అయితే విష్ణుప్రియ సిక్స్త్ సెన్స్ షోలో( Sixth Sense ) పాల్గొనగా ఈ షోలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా అనే ప్రశ్నకు స్పందిస్తూ విష్ణుప్రియ ఈ కామెంట్లు చేశారు.
ఇటీవల నేను ప్రేమలో పడ్డానని ఆయన వయస్సు నాకు సరిపోకపోవచ్చని అనుకుంటారని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.
ఆయనే జేడీ చక్రవర్తి( Chakravarthy ) అని అత్తయ్య ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు.
మంగళూరులో 40 రోజుల పాటు ఒక వెబ్ సిరీస్ కొరకు ఆయనతో కలిసి పని చేశానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.ఆ ప్రయాణంలో ఒకరోజు జేడీ చక్రవర్తికి నేను ఫ్లాట్ అయిపోయానని ఆమె కామెంట్లు చేశారు.
తాను ప్రేమలో పడటానికి చాలా విషయాలు ఉన్నాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.
2022 సంవత్సరం నవంబర్ 25వ తేదీ రాత్రి నాకు ఈ విషయం అర్థమైందని ఆమె కామెంట్లు చేశారు.తాను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని విష్ణుప్రియ వెల్లడించారు.ఈ ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.
జేడీ చక్రవర్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఆమె వెల్లడించారు.ఆయన రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నానని విష్ణుప్రియ పేర్కొన్నారు.
నా మనసులో ఉన్న విషయాలను ఆయనకు చెప్పేశానని నాకు ఇప్పటికే 28 సంవత్సరాలు వచ్చేశాయని తెల్ల జుట్టు కూడా వస్తోందని సమయం వృథా చేయడం ఇష్టం లేక నా మదిలో విషయాలను చెప్పేశానని ఆమె చెప్పుకొచ్చారు.విష్ణుప్రియ కవర్ సాంగ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు.ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.విష్ణుప్రియ పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.