నాక్కూడా బాలీవుడ్ హీరోనే కావాలంటున్న మహేష్.. ఎవరు ఫిక్స్ అయ్యారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే ( Pooja Hegd e) , శ్రీలీల ( SreeLeela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొన్నటి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.

 Ssmb28 Movie Latest Update, Ssmb28, Mahesh Babu, Trivikram, John Abraham , Ssmb-TeluguStop.com

ముందు నుండి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ కు తాజాగా బ్రేక్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లారు.అతి త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.ఇదిలా ఉండగా మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.

దీనిని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ( Trivikram ) ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో బాలీవుడ్ ( Bollywood) స్టార్స్ ను విలన్ పాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో మహేష్ కు పోటీగా జాన్ అబ్రహం ( John Abraham ) ను విలన్ పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట.

మరి ఈయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.ఈయన కనుక ఒప్పుకుంటే ఈ సినిమా మైలేజ్ బాలీవుడ్ లో పెరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక జగపతిబాబు ( Jagapathi Babu ) నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube