కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం కీలక దశకు చేరుకుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు కర్ణాటకలో మకాం వేశారు.
ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే నాలుగు సభల్లో పాల్గొననుండగా… చిత్రదుర్గ, హోస్పెట్, సిందనూరు, కల్బుర్గిలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.తీర్థహళ్లి, హరిహర ప్రాంతాల్లో చేపట్టే బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.
అటు ప్రియాంక గాంధీ మరో నాలుగు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.







