సామాన్యులకు కూడా అందుబాటు ధరలో దొరికే 'కార్స్' ఇవే... ఫీచర్లు అదుర్స్!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆయిల్ ధరల కారణంగా కొత్త కార్లు కొనాలనుకునేవారు ఎక్కువగా సీఎన్‌జీ కార్ల ( CNG cars )కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నారు.దాంతో పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు, పర్యావరణ అనుకూల ఈవీ కార్ల అమ్మకాలు ఇక్కడ క్రమంగా పెరుగుతున్నాయి.

 These Are The Cars That Can Be Found At An Affordable Price For Common People Th-TeluguStop.com

ఓ రకంగా చెప్పాలంటే వాటికి ధీటుగా ఈ కార్ల అమ్మకాలు ఎక్కువయ్యాయి.దాంతో సీఎన్‌జీ మోడల్స్‌కి మరింత డిమాండ్‌ ఏర్పడుతోంది.

కారణం.బడ్జెట్ ధరలోనే ఉండడం పైగా మంచి మైలేజీని కలిగి ఉండటం.

ఇకపోతే సీఎన్‌జీ కార్లు డీజిల్ కార్లకు( CNG cars to diesel cars ) మాంచి పోటీ ఇస్తున్నాయి అనడంలో సందేహమే లేదు.మార్కెట్లో అందుబాటు ధరలలో వున్న కార్లను ఒక్కసారి పరిశీలిద్దాము.బడ్జెట్ సీఎన్‌జీ కార్ల జాబితాలో, హ్యుందాయ్ ‘ఆరా’ కార్ మోడల్‌కు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉందని టాక్.దీని ధర ఎక్స్-షోరూమ్ రూ.6.32 లక్షల నుండి రూ.8.90 లక్షలుగా ఉంది.ఇది ఒక కిలో సిఎన్‌జికి గరిష్టంగా 28 కిమీ మైలేజీని ఇస్తుంది.హ్యూందాయ్ ఆరా తర్వాత, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్( Hyundai Grand i10 Nios ) కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.దీని ధర ఎక్స్-షోరూమ్ రూ.5.73 లక్షల నుండి రూ.దీని ధర 8.51 లక్షలు కాగా ఒక కిలో సిఎన్‌జికి గరిష్టంగా 28 కి.మీ మైలేజీని ఇస్తుంది.

ఆ తరువాత మారుతీ సుజుకీ గురించి మాట్లాడుకోవాలి. మారుతి బాలెనో, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు( Maruti Baleno, Swift hatchback cars ) బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.ఆ తరువాత టాటా కార్లు రాజ్యమేలుతున్నాయి.మంచి ఫీచర్లతో ఇవి అలరిస్తున్నాయి.బడ్జెట్ సీఎన్‌జీ కార్ల జాబితాలో, టాటా టియాగో, టిగోర్ ( Tata Tiago, Tigor )కూడా భారీ డిమాండ్‌ను కలిగి వున్నాయి.టాటా కంపెనీ తన కొత్త సీఎన్‌జీ కార్లలో i-CNG టెక్నాలజీని వాడుతుండడం కొసమెరుపు.

ఇవి అధిక మైలేజీని కలిగివుండడంతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube