సామాన్యులకు కూడా అందుబాటు ధరలో దొరికే ‘కార్స్’ ఇవే… ఫీచర్లు అదుర్స్!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆయిల్ ధరల కారణంగా కొత్త కార్లు కొనాలనుకునేవారు ఎక్కువగా సీఎన్‌జీ కార్ల ( CNG Cars )కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నారు.

దాంతో పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు, పర్యావరణ అనుకూల ఈవీ కార్ల అమ్మకాలు ఇక్కడ క్రమంగా పెరుగుతున్నాయి.

ఓ రకంగా చెప్పాలంటే వాటికి ధీటుగా ఈ కార్ల అమ్మకాలు ఎక్కువయ్యాయి.దాంతో సీఎన్‌జీ మోడల్స్‌కి మరింత డిమాండ్‌ ఏర్పడుతోంది.

కారణం.బడ్జెట్ ధరలోనే ఉండడం పైగా మంచి మైలేజీని కలిగి ఉండటం.

"""/" / ఇకపోతే సీఎన్‌జీ కార్లు డీజిల్ కార్లకు( CNG Cars To Diesel Cars ) మాంచి పోటీ ఇస్తున్నాయి అనడంలో సందేహమే లేదు.

మార్కెట్లో అందుబాటు ధరలలో వున్న కార్లను ఒక్కసారి పరిశీలిద్దాము.బడ్జెట్ సీఎన్‌జీ కార్ల జాబితాలో, హ్యుందాయ్ ‘ఆరా’ కార్ మోడల్‌కు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉందని టాక్.

దీని ధర ఎక్స్-షోరూమ్ రూ.6.

32 లక్షల నుండి రూ.8.

90 లక్షలుగా ఉంది.ఇది ఒక కిలో సిఎన్‌జికి గరిష్టంగా 28 కిమీ మైలేజీని ఇస్తుంది.

హ్యూందాయ్ ఆరా తర్వాత, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్( Hyundai Grand I10 Nios ) కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

దీని ధర ఎక్స్-షోరూమ్ రూ.5.

73 లక్షల నుండి రూ.దీని ధర 8.

51 లక్షలు కాగా ఒక కిలో సిఎన్‌జికి గరిష్టంగా 28 కి.మీ మైలేజీని ఇస్తుంది.

"""/" / ఆ తరువాత మారుతీ సుజుకీ గురించి మాట్లాడుకోవాలి.మారుతి బాలెనో, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు( Maruti Baleno, Swift Hatchback Cars ) బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఆ తరువాత టాటా కార్లు రాజ్యమేలుతున్నాయి.మంచి ఫీచర్లతో ఇవి అలరిస్తున్నాయి.

బడ్జెట్ సీఎన్‌జీ కార్ల జాబితాలో, టాటా టియాగో, టిగోర్ ( Tata Tiago, Tigor )కూడా భారీ డిమాండ్‌ను కలిగి వున్నాయి.

టాటా కంపెనీ తన కొత్త సీఎన్‌జీ కార్లలో I-CNG టెక్నాలజీని వాడుతుండడం కొసమెరుపు.

ఇవి అధిక మైలేజీని కలిగివుండడంతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.

రానా ఇలాంటి సినిమాలు చేస్తే హీరోగా నిలదొక్కుకోలేడా..?