తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు రానున్నారు.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 28న టీడీపీ భారీ సభ నిర్వహించనుంది.
విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరగనున్న ఈ సభకు రజనీకాంత్ హాజరుకానున్నారు.కాగా ఈ వేడుకలలో రజనీకాంత్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు పాల్గొననున్నారు.
దీంతో ఒకే వేదికను ముగ్గురు పంచుకోనున్నారు.మరోవైపు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సభలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో పాటు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.