చాలా మంది తాము పొట్టిగా ఉన్నామని లోలోపల క్రుంగిపోతుంటారు.అందువల్లే తమకు గర్ల్ ఫ్రెండ్స్ దొరకడం లేదని పొట్టి వ్యక్తులు బాధపడుతుంటారు.
ఇతరులతో కలిసేందుకు అంతగా ఆసక్తి చూపించరు.ఇదే కోవలో ఓ అమెరికన్ ( American ) వ్యక్తి భావించాడు.
తాను పొట్టిగా ఉండడం వల్లే తనకు ప్రియురాలు ( Girl Friend ) లేదని మదనపడేవాడు.దీంతో ఎలాగైనా హైట్ ( Height ) పెరగాలని అనుకున్నాడు.
అందుకోసం భారీగా ఖర్చు పెట్టి రెండు సార్లు సర్జరీ చేయించుకున్నాడు.కోట్లు ఖర్చు పెట్టినా అతడేమీ ధనవంతుడు కాదు.
అలాగని నవ యువకుడు కూడా కాదు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్( Moses Gibson ) వయసు 41 ఏళ్లు.అతడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు.దీంతో తనకు గర్ల్ ఫ్రెండ్ లేపోవడానికి తాను పొట్టిగా ఉండడమే కారణం అని బాగా బాధపడేవాడు.ఇంతకు ముందు అతడు కేవలం 5.5 అడుగులు ఉండే వాడు.అయితే గిబ్సన్ తాను హైట్ పెరగాలనుకుంటున్నట్లు వైద్యులకు చెప్పి మూడేళ్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నాడు.దీంతో 5.8 అడుగులకు పెరిగాడు.మూడు అంగుళాలు పెరిగినా అతడికి తృప్తి కలగలేదు.దీంతో ఇది చాలదని తాజాగా మరో రెండు అంగుళాలు పెరిగేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

రెండోసారి జరిగిన ఆపరేషన్ చాలా క్లిష్టతరమైనది.భరించలేని నొప్పి కలుగుతుంది.అయినా ఆ నొప్పిని భరిస్తూ తాను 5.10 అడుగుల హైట్ చేరుకుంటానని సంతోషంగా చెబుతున్నాడు.శస్త్రచికిత్స అయిన తర్వాత అతడి కాన్ఫిడెన్స్ చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.మరోవైపు అతడికి ప్రస్తుతం ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది.ఇక భారత కరెన్సీలో అతడి శస్త్రచికిత్సలకు అయిన ఖర్చు అక్షరాలా రూ .1.35 కోట్లు. ఇది విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అంత ఖర్చు పెట్టి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ డబ్బే ఉంచుకుంటే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.







