టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం( Shaakunthalam ) .తాజాగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయిన విషయం తెలిసిందే.
ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించగా దేవ్ మోహన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.అలాగే చిన్నప్పటి భరతుడి పాత్రలో స్టార్ హీరో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ( Allu Arha ) నటించింది.

సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి.దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పనిచేసే క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తిని ఎదురు చూశారు.కానీ ఈ సినిమా విడుదలైన రోజు నెగిటివ్ టాక్( Negative Talk )రావడంతో కనీసం ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమాను చూడడానికి కూడా ఆసక్తిని చూపించడం లేదు.ఆశించిన విధంగా ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు.
ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విడుదల అయి కనీసం రోజులు కూడా పూర్తికాకముందే అప్పుడే ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్( Shaakuntalam OTT ) అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

శాకుంతలం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) భారీ రేటుకు సొంతం చేసుకుంది వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమాను మే మొదటి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.స్టార్ హీరోయిన్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ లో వస్తుంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇకపోతే హీరోయిన్ సమంత విషయానికి వస్తే.గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.







