ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలు దేరనున్నారు.ఇందులో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.హస్తిన పర్యటన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ కానున్నారు.రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.కాగా రెండు వారాల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.