నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం తన తాజా చిత్రం దసరా(Dasara) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా మార్చ్ 30 తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి నాని ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి నటి శ్రీదేవి(Sridevi) గారికి పెద్ద అభిమానినని తెలిపారు.నేను పెరుగుతూ ఉండే కొద్ది శ్రీదేవి గారికి వీరాభిమానిగా మారిపోయానని తెలిపారు.

ఇలా ఇప్పటికీ ఆమె నా ఫేవరెట్ హీరోయిన్ అంటూ నాని ఈ సందర్భంగా శ్రీదేవి గారి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తన డేట్ డ్రీమ్ హీరోయిన్ కూడా శ్రీదేవి గారని అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు తను మన మధ్యన లేరు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.శ్రీదేవి రాంగోపాల్ వర్మ(Ramgopal Varma) దర్శకత్వంలో నటించిన క్షణం క్షణం (Kshanam Kshanam )సినిమాని ఇప్పుడు చూసిన తనకు ఆ సినిమా ఓ కలగానే ఉంటుంది అంటూ నాని శ్రీదేవి గారిపై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేశారు.ఇలా తన అభిమాన హీరోయిన్ శ్రీదేవి అంటూ నాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక నాని దసరా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విడుదలకు మరొక రోజు సమయం మాత్రమే ఉంది.మరికొన్ని గంటలలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలాంటి స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా నానికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాకు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వం వహించక సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాలో నాని సరసన మరోసారి కీర్తి సురేష్(Keerthi Suresh) సందడి చేయబోతున్నారు.







