తిరుగు బాటు ఎంఎల్ఏ లు మాత్రం అవుననే అంటున్నారు .నిజానికి ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినా లేదా పార్టీని వదిలి వేరే పార్టీలకు జంప్ చేసినా పాత పార్టీ మీద, పార్టీ అధినేత మీద విమర్శలు చేయడం సహజమే.
కానీ ఇప్పటి వరకు పార్టీని వదిలి వెళ్ళిన నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC Elections ) క్రాస్ ఓటింగ్ కి పాల్పడి సస్పెండ్ కాబడిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా సజ్జల ( Sajjala Ramakrishna Reddy ) మీద మాత్రమే విమర్శలు చేస్తున్నారు .జగన్ ని ( CM Jagan ) వారు పల్లెత్తు మాట అనట్లేదు.ఇంకా జగన్ చాలా మంచివాడని ఆయన మీద మా అభిప్రాయం చివరి వరకు అలాగే ఉంటుందని కూడా సర్టిఫై చేస్తున్నారు.ఉండవల్లి శ్రీదేవి లాంటివారైతే తమకు ఏదైనా జరిగితే దానికి సజ్జల కారణమంటూ చెబుతున్నారు.
అంటే సజ్జల రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
నిజానికి ఆయన పదవి సలహాదారు మాత్రం కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధికంగా ప్రెస్ మీట్లు పెట్టిన ఘనత ఆయనకే చెందుతుంది .అది ఏ శాఖకు సంబంధించిన విషయమైనా సరే వివరాలను ఆయనే మీడియాకు చెబుతారు.ప్రభుత్వ నిర్ణయాలు ఏమైనా సరే ఆయన నోటి వెంటే ప్రజల కి వినిపిస్తుంటాయి.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు బదులివ్వాలన్నా, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరపాలన్నా ఆయన ఉండాల్సింది .అందుకే ఆయనను ప్రతిపక్షాలు సకల శాఖ మంత్రిగా విమర్శిస్తుంటాయి.ఒకరకంగా ఆయనకు ఇవ్వాల్సిందాని కంటే కూడా జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని, ప్రజాభిప్రాయాన్ని పార్టీలో లుక లుకల్ని జగన్ వరకు వెళ్లకుండా ఈయన మేనేజ్ చేస్తుంటాడని తనకు నచ్చిన తనతో మంచి సంబంధాలు ఉన్న ఎమ్మెల్యేలకు
మంచి ప్రయారిటీ ఇచ్చి, తనకు నచ్చని వారిని జగన్కు దూరం చేసేలాగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని .ఈయన ను నమ్ముకుంటే జగన్ ఎప్పుడో ములుగి పోతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇదంతా జగన్కు తెలిసే జరుగుతుందా లేదా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు .ఏది ఏమైనా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ స్థాయిలో చక్రం తిప్పే నాయకుడు మనకు కనిపించరు.మరి అధినేతను తప్పుదారి పట్టిస్తున్నారని వస్తున్న విమర్శలను వైసీపీ అధిష్టానం పట్టించుకుంటుందా లేక ఎప్పటిలానే కొట్టి పడేస్తుందా అన్నది చూడాలి.సొంత పార్టీ నేతలే అసూయ చెందే స్థాయిలో తన మాట చలాయించుకుంటున్న సజ్జల ఎంతకాలం తన గ్రిప్ ని పార్టీ లో నిలబెట్టు కుంటారో?
.