పేద పిల్లలకు ఫ్రీగా బుక్స్ అందిస్తున్న ఎన్నారై బాలిక.. ఆ ఆఫీసర్‌తో టై-అప్!

టెక్సాస్‌కు( Texas ) చెందిన అలీషా మధువర్షి( Alisha Madhuvarshi ) అనే 16 ఏళ్ల ఎన్నారై బాలిక ఓ గొప్ప పని చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది.ఈ బాలిక గతేడాది డిసెంబర్ నెలలో ఉత్తర ప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఒక కాలేజీకి ఏకంగా 300 పుస్తకాలను విరాళంగా ఇచ్చింది.

 Us Based Nri Teen Providing Free Books To Underprivileged Children Details, Ali-TeluguStop.com

సబ్జెక్ట్‌తో ఇబ్బంది పడే విద్యార్థులకు గణితాన్ని బోధించడం ద్వారా అలీషా పుస్తకాలు కొనడానికి డబ్బును కలెక్ట్ చేసింది.ఈ బాలిక భారతదేశంలోని నిరుపేద పిల్లలకు విద్య కోసం డబ్బును విరాళంగా అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ఇక ఢిల్లీలోని ఓ మురికివాడలో పిల్లల కోసం లైబ్రరీని నడుపుతున్న రాకేష్ నిఖాజ్ అనే పోలీసు అధికారి అలీషాకు స్ఫూర్తి.మంచి పుస్తకాలు అందుబాటులో లేని పిల్లలకు అలీషా కొనే పుస్తకాలను నిఖాజ్ అందజేస్తారు.

అలీషా తల్లి షామా ఆర్య మాట్లాడుతూ.ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే తపన అలీషాకు ఎప్పటి నుంచో ఉందని అన్నారు.2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో నష్టపోయిన చాలామంది వ్యక్తులకు ఆహారం, బట్టలు, మందులు అందించడానికి కూడా అలీషా నిధులు సేకరించింది.అలీషా గణితంలో మంచి ప్రతిభ కనబరిచింది.

మెంటల్ క్యాలుకులేషన్స్‌ త్వరగా ఎలా చేయాలో ప్రజలకు బోధించే “నంబర్ సెన్స్ వర్క్‌బుక్” అనే పుస్తకాన్ని కూడా రాసింది.ఆమె భారతదేశంలోని అణగారిన పిల్లల విద్యకు నిధులు సమకూర్చడానికి పుస్తకంలోని రాయల్టీలను ఉపయోగిస్తుంది.

Telugu Books, Rakesh Nikhaj, Texas, Underprivileged, Nrialisha, Nri, Uttar Prade

అలీషా విరాళాన్ని స్వీకరించిన కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ శుక్లా, పిల్లలను చదివించేందుకు కృషి చేసిన అలీషా, నిఖాజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.వారు అందించిన పుస్తకాలను పాఠశాల విద్యార్థులే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే ఇతర పేద పిల్లలు కూడా ఉపయోగిస్తారు.పాఠశాల సమయం తర్వాత మధ్యాహ్నం 3-5 గంటల మధ్య లైబ్రరీ అందరికీ తెరిచి ఉంటుంది.

Telugu Books, Rakesh Nikhaj, Texas, Underprivileged, Nrialisha, Nri, Uttar Prade

అలీషా కృత్రిమ మేధస్సులో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటోంది.ఆమె ప్రస్తుతం డల్లాస్‌లోని టెక్సాస్ అకాడమీ ఆఫ్ మ్యాథ్ అండ్ సైన్స్‌లో 11వ తరగతి చదువుతోంది.అలానే మాజీ TedX స్పీకర్.

ఆమె పుస్తకాలు, ఇతర వస్తువులను విరాళంగా ఇచ్చే పిల్లలతో మాట్లాడినప్పుడల్లా, విద్య ఎంత ముఖ్యమైనదో ఆమెకు తెలుసుకుంటోంది.అణగారిన పిల్లలు ఎదగడానికి అవకాశాలు అవసరమని, వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తాజాగా చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube