సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ళు దాటినా ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ అందంలో ఏమాత్రం తీసిపోకుండా మైంటైన్ చేస్తున్నాడు.ఈయన లేటెస్ట్ మేకోవర్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సినీ లవర్స్ ను కట్టి పడేస్తుంది.
మహేష్ బాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాయి.తన స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
మహేష్ బాబు తన కెరీర్ లో గత కొన్నాళ్లుగా ప్లాప్ అనేది లేకుండా వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ప్రెజెంట్ త్రివిక్రమ్ తో SSMB28 సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాను మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా త్రివిక్రమ్ ప్లాన్ చేయడంతో ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్ట పడుతున్నాడు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లో జరిగిన టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ బాష్ కు భార్య నమ్రతతో కలిసి హాజరయ్యాడు.ఈ వేడుకకు ఆస్కార్ అవార్డు గ్రహీత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు విచ్చేశాడు.
మరి ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రెహమాన్ తో కలిసి లవ్లీ సెల్ఫీ దిగాడు.

ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక 2004 లో మహేష్ బాబు నటించిన నాని సినిమాకు ఎఆర్ రెహమాన్ సౌండ్ ట్రాక్ లను అందించారు.ఈ సినిమా నిరాశ పరిచిన కూడా ఫ్యాన్స్ కు మాత్రం ఈయన అందించిన పాటలు ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాయి.
ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ అంతా మరోసారి ఈ కాంబో రిపీట్ చేయాలని కోరుతున్నారు.ఈ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ మరోసారి గ్లోబల్ వైడ్ గా వైరల్ అవుతున్నాయి.
అవన్నీ ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తున్నాయి.







