ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరిన ఎన్టీఆర్... ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Ntr Left America For The Oscar Event Photos Viral Ntr, America, Oscar Event, Pho-TeluguStop.com

ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఒర్జినల్ సాంగ్ క్యాటగిరి లో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకొని ఆస్కార్ కి నామినేట్ కావడంతో తప్పకుండా ఆస్కార్ వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీ ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటికే RRRచిత్ర బృందం అమెరికా చేరుకొని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.రాజమౌళి రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.రామ్ చరణ్ ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా, ఏబీసీ మీడియా ఇంటర్వ్యూ, హెచ్‌సీఏ అవార్డు వేడుకల్లో రామ్ చరణ్ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం ఈ కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉండగా ఆయన కొరటాల శివతో చేయాల్సిన సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్న నేపథ్యంలో అమెరికా పర్యటనకు వెళ్లలేక పోయారు.

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ప్రారంభం కాకముందే ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణించడంతో ఈ సినిమా షూటింగ్ పనులు కూడా వాయిదా పడ్డాయి.ఇక తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాలు పూర్తి అయ్యేలోపు ఆస్కార్ అవార్డుల ప్రకటన దగ్గర పడటంతో ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాతనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాని ప్రారంభించబోతున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా అమెరికాకు బయలుదేరారు.ఇక ఈ ఏడాది మాత్రం తప్పనిసరిగా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ వస్తుందని ఆస్కార్ తీసుకొని ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇతర చిత్ర బృందం ఇండియా తిరిగి రాబోతున్నారంటూ చాలామందికి అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube