తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు వేణు.
ఇకపోతే వేణు బలగం సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.బలగం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
తెలుగులో ఉన్న ఒక సంప్రదాయం, ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక ఎమోషనల్ జర్నీని వేణు అద్భుంతగా తెరకెక్కించాడు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై జర్నలిస్ట్ గడ్డం సతీశ్ ఆరోపణలు చేశారు.

అయితే తాజాగా ఆ ఆరోపణల పై డైరెక్టర్ వేణు స్పందించాడు.తాజాగా గడ్డం సతీష్ ఆరోపణలపై స్పందించిన మాట్లాడుతూ.జర్నలిస్ట్ గడ్డం సతీశ్ మా కథను అబాసు పాలు చేస్తున్నాడు.మా కథ ఇప్పటికే ప్రజల్లో ఉంది.ఆయన రాసిన కథ కూడా ఉంది.రెండిని ఒకసారి గమనిస్తే విషయం ఏంటో అర్థమవుతుంది.
తన మూల కథను కాపీ కొట్టాం అంటున్నాడు. మూల కథ అనేది అసలు ఎక్కడా లేకుండా వాళ్లే ప్రత్యేకంగా రాస్తే అవుతుంది.
కాకిని ఆయనేమీ తయారు చేయలేదు కదా? పిట్ట ముట్టుడు అనేది తెలుగు సంస్కృతి.మా నాన్న చనిపోయిన సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది.

ఆ తర్వాత దీనిని కథగా మలిచాను.దీనిపై నేను ఆరేళ్లపాటు రీసెర్చ్ చేశాను.మొదట ఈ కథను డైరెక్టర్ అనుదీప్ కి వినిపించాను అని వేణు చెప్పుకొచ్చాడు.అసలు నేను సతీశ్ రాసిన కథను చదవను కూడా లేదు.కథ ఆయనదే అయితే రచయితల సంఘాన్ని కలవాల్సిందిగా? పిట్ట ముట్టుడు సంప్రదాయం అనేది ఎవరి సొత్తు కాదు.తెలుగు సంస్కృతులను ఒక్కొక్కరు ఒకలా చూపిస్తారు.
ఇదే సంస్కృతిపై ఎవరైనా సినిమాలు చేయచ్చు.ఈ కాకి మీద ఇంకా వంద సినిమాలు చేసినా నాకు హక్కు లేదు.
సంస్కృతిపై ఎవరికీ హక్కు ఉండదు.చట్టబద్దంగా వెళ్తాను అంటున్నారు.
అలాగే వెళ్లండి మీకు నాకు ఒకే చట్టం అలాగే వెళ్దాం అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు వేణు.







