వక్షోజాలు వదులుగా మారడం.మహిళల్లో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.
ముఖ్యంగా ప్రసవం అనంతరం ఎక్కువ శాతం మంది మహిళల వక్షోజాలు వదులుగా మారుతుంటాయి.దీంతో శరీర ఆకృతి పాడవుతుంది.
ఈ క్రమంలోనే తమ రూపాన్ని తిరిగి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.వదులుగా మారిన వక్షోజాలను బిగుతుగా మార్చుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
అయితే ఆడవారిలో వక్షోజాల ఆకృతి మారడం, వదులుగా అవడం సహజంగా జరిగే ప్రక్రియ.అంత మాత్రానికి హైరానా పడిపోవాల్సిన అవసరం లేదు.
వదులుగా మారిన వక్షోజాలను టైట్ గా మార్చడానికి ఎన్నో అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం ముక్కలు వేసుకోవాలి.చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ గిన్నెను కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి ఉడికించాలి.
ఆ తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత వక్షోజాలకు అప్లై చేసి సర్కులర్ మోషన్ లో కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే వదలుగా మారిన వక్షోజాలు కొద్ది రోజుల్లోనే బిగుతుగా మారతాయి.దాంతో మీ శరీర ఆకృతి మళ్లీ మునుపటిలాగా మారుతుంది.కాబట్టి ఆడవారిలో ఎవరైతే వదులుగా మారిన వక్షోజాలతో తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







