తన లవర్ తన ఇష్టం... నాగశౌర్య వీడియో పై స్పందించిన రష్మీ... ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

హీరో నాగశౌర్య తాజాగా రోడ్డుపై తన హీరోయిజం చూపించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రోడ్డుపై ఒక అబ్బాయి తన లవర్ ని కొడుతూ ఉండడం చూసినటువంటి నాగశౌర్య వెంటనే కారు దిగి ఆ అబ్బాయిని నిలదీశారు.

 Anchor Rashmi Reacts On Hero Naga Shaurya Fight Video On Road Details, Rashmi, N-TeluguStop.com

ఇలా రోడ్డుపై అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఏంటి ముందు తనకు క్షమాపణలు చెప్పు అంటూ నాగశౌర్య ఆ అబ్బాయిని నిలదీశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరిది నిజంగానే జరిగిందా లేదా సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి ఫ్రాంక్ చేస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఒక అబ్బాయి రోడ్డుపై అమ్మాయిని కొట్టడం భావ్యం కాదు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం వాడి లవర్ వాడి ఇష్టం మధ్యలో మీకెందుకు అంటుకొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే నేటిజన్స్ చేసిన ఈ కామెంట్లపై యాంకర్ రష్మీ స్పందించారు.ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

వాడి లవర్ వాడి ఇష్టమట అమ్మాయే సపోర్ట్ చేస్తుందిగా ఇలాంటి కామెంట్లు కనుక చూస్తే ఒక్కోసారి సిగ్గేస్తోంది అసలు ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులలో ఉందో ఎవరికి తెలుసు? మీరు మరో ఆత్మహత్య ఘటన జరగాలని కోరుకుంటున్నారా అంటూ రష్మీ ప్రశ్నించారు.రష్మి ఇలా ఈ ఘటనపై రియాక్ట్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మిని టార్గెట్ చేశారు.ఇవన్నీ కూడా మీ జబర్దస్త్ కార్యక్రమంలో చూసి నేర్చుకున్నవే అక్కడ ఇలాంటి స్కిట్లు వేస్తే మాత్రం నవ్వుతావు… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటూ నేటిజన్స్ రష్మీనీ ట్రోల్ చేస్తున్నారు.ఏది ఏమైనా గత వారం రోజులుగా రష్మీ నేటిజన్ల చేతిలో దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube