సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.తినే తిండి నుండి కట్టుకునే బట్ట వేసుకునే చెప్పులు వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా విలువైనవి ఉపయోగిస్తూ ఉంటారు.
హీరోలు అయితే వాచ్లు,షూల కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు.హీరోలు ఏదైనా ఇంటర్వ్యూలకు ప్రీ రిలీజ్ వేడుకలకు వచ్చినప్పుడు ఆ వస్తువులు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి.
కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

రామ్ చరణ్ వాడే షూస్ వాచ్ షూట్ అలాగే కార్ల ఖరీదు తెలుసుకొని వామ్మో అన్ని కోట్ల విలువైన వస్తువులను ఉపయోగిస్తారా అని అభిమానులను నోరెళ్ళబెట్టారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్ గురించి చర్చలు నడుస్తున్నాయి.ఈ మధ్య చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు సక్సెస్ మీట్లకు ఎక్కువగా పాల్గొంటున్నారు.
అయితే ఒక ఈవెంట్ కి వచ్చిన ప్రతిసారి ఒక్కో రకమైన చేతి వాచ్లు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్నా ఒక లగ్జరీ వాచ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

చిరు పెట్టుకునే రోలెక్స్ వాచ్ ఖరీదు చాలా ఎక్కువ.రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా దాదాపుగా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైమాటే.ఈ విషయం తెలిసి అవాక్కవుతున్నారు మెగా అభిమానులు, నెటిజన్స్.అలాగే మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది.ఎ.లాంగే మరియు సోహ్నే వాచ్ లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు 33,77,610 రూపాయలు అని తెలుస్తోంది.
వాచ్ లకు ఇంత కాస్ట్ పెడితే మెగాస్టార్ వాడే ఇతర వస్తువుల ధర ఎంత ఉంటుందో అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.







