సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలలో ముద్దు పెట్టుకోవడం అన్నది సర్వసాధారణం.అయితే ఇప్పట్లో ఇది ప్రస్తుతం సర్వసాధారణమే అయినప్పటికీ ఒకప్పుడు ముద్దు పెట్టుకోవడం అంటే పెద్ద విషయమే అని చెప్పవచ్చు.
అంతేకాకుండా దాన్ని ఒక వింతలాగా కూడా చూసేవారు.ఒకవేళ తమ సినిమాలో ముద్దు సన్నివేశాలుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకునేవారు.
అలా గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఇలాంటి సీన్స్ ఆలోవర్ ఇండియన్ మూవీస్ లో చాలా కామన్ అయిపోయాయి.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా.
ఆ విషయంలోకి వెళ్తున్నాం.భారతీయ సినీ చరిత్రలో అత్యంత విలువైన ముద్దు అనగానే చాలామంది దయావన్ సినిమాలోని సీన్ అని చెప్పేస్తుంటారు.1988 లో థియేటర్లలోకి విడుదలైన ఈ సినిమాను ఫిరోజ్ ఖాన్ డైరెక్ట్ చేయగా వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ కలిసి నటించారు.ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది.
అయితే ఈ లిప్ లాక్ సీన్ చూసి అప్పట్లో చాలామంది షాక్ అయ్యారు.

ఎందుకంటే ఈ సినిమా విడుదల అయ్యే నాటికి మాధురీ దీక్షిత్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.అటువంటి ఆమె ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని ఇప్పటికీ జర్నలిస్టులు ఆమెని అడుగుతూ ఉంటారు.ఇదే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన మాధురి దీక్షిత్.
నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు.ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ సరే ఆ సీన్ పెట్టారు అనిపిస్తుంది.

నేను దానికి నో చెప్పి ఉండాల్సింది అని చెప్పుకొచ్చింది మాధురి దీక్షిత్.అయితే ఈ సీన్ తో పాటుగా సినిమాలో నటించేందుకుగానూ మాధురీ దీక్షిత్ కు భారీ మొత్తంలో అనగా అప్పట్లోనే దాదాపుగా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట.అందుకే ఆమె నో చెప్పలేకపోయింది అనిపిస్తోంది.అప్పట్లో కేవలం అమితాబ్ కు మాత్రం కోటివరకు ఇచ్చేవారు.అలాంటిది తనకు కూడా ఇస్తానని చెప్పేసరికి మాధురి నో చెప్పలేకపోయి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.







