నమ్మశక్యంగా లేని పఠాన్ కలెక్షన్స్.. మ్యాజిక్‌ ఏమైనా జరుగుతోందా

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కలెక్షన్స్ ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్య పరచుతున్నాయి.

వరుసగా ఆరు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా పఠాన్‌ సినిమా భారీ కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.

ఆరు రోజుల్లో దాదాపు 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసి బాలీవుడ్ రికార్డులన్నింటినీ కూడా పఠాన్ సినిమా బ్రేక్ చేసింది.అన్ని రకాలుగా పఠాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో ఆశ్చర్య పరచుతూ దూసుకు వెళ్తోంది.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా రూపొందిన పఠాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

అందుకే ఇండియాలో రూ.300 కోట్లు వసూలు నమోదు అయితే ఓవర్సీస్ లో కూడా దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదైనట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఈ కలెక్షన్స్ నమ్మశక్యంగా లేవు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.తెలుగు నిర్మాతల మాదిరిగా రూ.50 కోట్ల కలెక్షన్స్ వస్తే 100 కోట్ల రూపాయలని చూపిస్తున్నారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కానీ బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పఠాన్‌ యొక్క కలెక్షన్స్ నిజమే అనిపిస్తోంది.

Advertisement

పఠాన్‌ సినిమా యొక్క టాక్ పాజిటివ్ గా ఉండడంతో పాటు షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన సినిమా అవడం, పైగా ఈ సినిమా కు పెద్ద ఎత్తున వివాదాలు రావడం తో ఈ స్థాయి లో కలెక్షన్స్‌ నమోదు అవుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు షారుఖ్ నుండి రాబోతున్న సినిమాలకు కూడా ఇది పెద్ద బూస్ట్ అనడం లో సందేహం లేదు.అంతే కాకుండా బాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాలకు కూడా ఇది కచ్చితంగా అదనపు బలం అవ్వబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు