బ్రేకింగ్: బడ్జెట్ ఆమోదం అంశంలో ప్రభుత్వ పిటిషన్‎కు టీఎస్ హైకోర్టు అనుమతి

బడ్జెట్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపలేదు.

 Breaking :the Ts High Court Allowed The Government's Petition In The Matter Of B-TeluguStop.com

దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేసింది.ఈ విషయంలో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పిటిషన్ ను విచారించేందుకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది.ఈ మేరకు ప్రభుత్వం తరపున సుప్రీం సీనియర్ కౌన్సిల్ దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారని తెలుస్తోంది.

కాగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోన్న ప్రభుత్వం.

ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు.అయితే గవర్నర్ మాత్రం బడ్జెట్ ను ఇంతవరకూ ఆమోదించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube