బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరణ్ జోహార్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అంతే కాకుండా బాలీవుడ్ లో ఉన్న బడా ప్రొడ్యూసర్స్ లో నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ నిర్మాత కొరియోగ్రాఫర్ అయిన ఫరాఖాన్ కరణ్ జోహార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.ఈ సందర్భంగా ఆమె కరణ్ జోహార్ డ్రెస్సింగ్ స్టైల్ పై స్పందించింది.

ఫరాఖాన్ ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఒక హోటల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది.ఈ నేపథ్యంలోనే ఆమె ధరించిన దుస్తులపై కరణ్ జోహార్ ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించగా.కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారు అని ఆమె తెలిపింది.అంతేకాకుండా నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ జోహార్ కనిపించడం.
అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ లాగా దుస్తులు ధరిస్తాడు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఫరాఖాన్.ఇది ఇలా ఉంటే పరాగం సినిమాల విషయానికి వస్తే.
ఆమె చివరగా దర్శకత్వం వహించిన సినిమా హ్యాపీ న్యూ ఇయర్.

ఈ సినిమా 2014లో విడుదలైన విషయం తెలిసిందే.ఆ సినిమాలో షారుక్ ఖాన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించారు.ఇకపోతే ప్రస్తుతం ఫరాఖండ్ బిగ్ బాస్ సీజన్ 16 కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే సినిమాలలో కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరిస్తోంది.అయితే ఆ ఈవెంట్లో ఫరాఖాన్ వాఖ్యలు చేసినప్పుడు కరణ్ జోహార్ కూడా ఉండడం విశేషం.







