ఇటీవలే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే.చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.
శ్రీనివాసమూర్తి మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.శ్రీనివాసమూర్తి తెలుగు అలాగే తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే.
దీంతో తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు శ్రీనివాసమూర్తికి సంతాపం వ్యక్తం చేశారు.అయితే శ్రీనివాస మూర్తి గుండెపోటుతో మరణించాడని మొదట అందరూ అనుకున్నారు.
కానీ శ్రీనివాసమూర్తి చనిపోయింది గుండెపోటుతో కాదు అంటూ అసలు విషయాన్ని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు డబ్బింగ్ ఆర్టిస్ట్ నటుడు రవిశంకర్.

కాగా రవిశంకర్ తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.శ్రీనివాసమూర్తి మరణం గురించి రవిశంకర్ స్పందిస్తూ.శ్రీనివాసమూర్తి మరణం గురించి అందరూ హార్ట్ ఎటాక్ అని మాట్లాడుకుంటుంటే వార్తలను చూసి విన్నాను.
కానీ అందరూ అనుకుంటున్నట్టుగా అసలు జరిగింది అది కాదు.పూజ చేసే సమయంలో పూలు తెంపడానికి వెళ్లి రెండు అంతస్తు నుండి పడ్డాడు అని ఫ్యామిలీ వాళ్ళు తెలిపారు.
అయితే ఆ సమయంలో స్లిప్ అయ్యి పైనుంచి కింద పడ్డాడా లేకపోతే ఏదైనా స్ట్రోక్ వచ్చి కింద పడిపోయాడా? అన్నది మాత్రం తెలియదు కానీ పైనుండి నేరుగా రోడ్డుపై పడిపోయి ఉన్నాడు.

తనకు రోజు పూజ చేసి వర్క్ కు వెళ్లే అలవాటు ఉందని నాతో చెప్పాడు అని చెప్పుకొచ్చాడు రవిశంకర్.మూర్తికి దైవభక్తి ఎక్కువ.అందుకే ఎప్పుడైనా సరే దేవుడికి పూజ చేసిన తర్వాత బయటకు వెళ్తాడు.
ఇక ఎప్పటిలాగే తాజాగా కూడా ఇంటి నుండి బయటకు వెళ్లడానికి డ్రైవర్ గేటు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు.ఆ సమయంలో రెండో అంతస్తులో పూలు కోయడానికి వెళ్లి అక్కడి నుండి స్లిప్ అయి పడిపోవడంతో వెంటనే తలకు పెద్ద గాయం అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు.
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి పిలుచుకొని వెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది.ఏది ఏమైనప్పటికీ మూర్తి ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చాడు రవిశంకర్.








