మెగా కుటుంబంలోకి త్వరలోనే బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా మెగా ఇంట్లోకి మరికొన్ని నెలలలో వారసులు రాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి తాజాగా రామ్ చరణ్ సోదరి సుస్మిత కూడా స్పందించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సుస్మిత మాట్లాడుతూ ఇప్పటికి మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.
రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుంటుంది అని తన మనసులో కోరికను బయటపెట్టారు.

ఇలా తరచూ ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.ఇక ఉపాసన కూడా తరచూ తన బిడ్డ గురించి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.గత రెండు రోజుల క్రితం నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడంతో నాతోపాటు నా బిడ్డకు కూడా ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది అంటూ ఈమె పోస్ట్ చేశారు.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాసన తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఏడాది సంక్రాంతి అంటే మాతృత్వాన్ని ఆస్వాదించడమే.ఈ దశని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను… మా ప్రయాణం లో ఇది ఒక కొత్త ఆరంభం అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ తన బిడ్డ గురించి ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.







